News September 13, 2025

వెల్గటూర్: రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

image

వెల్గటూర్ మండలం కిషనరావుపేట్ గ్రామ బస్టాప్‌కు సమీపంలో రాష్ట్ర రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌‌లో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 20, 2026

ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

image

మార్చి 21న ప్రభుత్వం రంజాన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.

News March 20, 2026

విద్యుత్ సిబ్బంది భద్రతకు ‘ఎల్సీ యాప్’ కవచం

image

ఖమ్మం: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.