News September 13, 2025

HYD: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పనిచేయాలి: MD

image

HYD నగరంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ CMD ముషారఫ్ ఫారూఖీ 180 అసిస్టెంట్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీరో శాతం ఫిర్యాదులే లక్ష్యంగా వారంలో కనీసం రెండు సార్లు బస్తీలు, కాలనీలను పర్యటించాలని చెప్పారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించి వినియోగదారుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు.

Similar News

News March 17, 2026

NLG: రైతులకు అలర్ట్.. రాబోయే రెండు రోజులు వర్షాలు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News March 17, 2026

నిర్దోషిగా బయటకు వస్తా: ఏలూరు MP

image

హైదరాబాద్‌లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.

News March 17, 2026

PPM: ‘అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండరాదు’

image

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రహదారులు, భవన నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించి, పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబరులో అటవీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.