News September 13, 2025
విజయవాడ దుర్గగుడిలో రూ.500 టికెట్ల రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లను రద్దు చేసే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత దసరా ఉత్సవాలలో ఈ టికెట్లు తీసుకున్న భక్తులను ప్రధాన ద్వారం నుంచే దర్శనం చేయించి పంపించారు. గతేడాది ఈ టికెట్ల ద్వారా ఆలయానికి రూ.2.30 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి కేవలం రూ. 300 టికెట్లను మాత్రమే విక్రయిస్తారని సమాచారం.
Similar News
News September 13, 2025
ములుగు: లోక్ అదాలత్‌లో 1,409 కేసులు పరిష్కారం

ములుగు జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేయగా 1,409 కేసులను పరిష్కరించారు. పెండింగ్ కేసులలో రాజీ కుదుర్చుకోవడంతో ప్రశాంత జీవనం సాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ అన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ పడ్డ కేసులకు పైకోర్టులలో అప్పీల్ ఉండదని, ఇదే అంతిమ తీర్పు అని తెలిపారు. కక్షిదారులకు పులిహోర పంపిణీ చేశారు.
News September 13, 2025
GWL: జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,884 కేసులు పరిష్కారం

తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో న్యాయం అందించడమే లక్ష్యమని గద్వాల జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలత పేర్కొన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 6,884 కేసులు పరిష్కరించామని తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 22, క్రిమినల్ కేసులు 6,832, కుటుంబ వివాదాల కేసులు 2, ప్రమాద బీమా కేసులు 6, సైబర్ క్రైమ్ కేసులు 22, ఇరు వర్గాల సమ్మతితో తక్కువ ఖర్చుతో పరిష్కరించామని చెప్పారు.
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్‌కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్‌లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్‌ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్‌లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్‌ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.