News September 13, 2025
ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: హెల్త్ డైరెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడారు. వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆయన అన్నారు.
Similar News
News March 28, 2026
రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్‌తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.
News March 28, 2026
లింగాపూర్: చెరువులో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

లింగాపూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ (35-40 ఏళ్లు) శవం లభ్యమైందని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని ఆయన కోరారు. దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
News March 28, 2026
HYDలో దంచికొట్టిన వర్షం.. రికార్డు వివరాలు ఇవే..!

HYD నగరంలో రాత్రి వర్షం దంచికొట్టింది. పాత GHMC పరిధి అల్వాల్ అంబేడ్కర్ నగర్‌లో అత్యధికంగా 14.0 మి.మీ వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడలో 13.8 మి.మీ, వెస్ట్ మారేడ్పల్లిలో 13.0 మి.మీ వర్షం పడింది. నేరెడ్‌మెట్, ఆనంద్ బాగ్, మౌలాలి, సఫిల్‌గూడ ప్రాంతాల్లో 12 మి.మీకి పైగా వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. వేసవి వేళ వర్షం కాస్త ఉపశమనం కలిగించి.


