News April 4, 2024
‘కావలి’ ప్రజలకు ఎవరు కావాలో?

AP: నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో 1952 నుంచి 15సార్లు ఎన్నికలు జరిగాయి. 6సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఓసారి గెలిచారు. 2014, 19లో YCP నుంచి గెలిచిన ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, TDP నుంచి కావ్య కృష్ణారెడ్డి తనదే గెలుపంటున్నారు. ఇద్దరికీ ఆర్థిక, అంగబలం ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 15, 2025
రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్‌పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
News September 15, 2025
మానసిక సమస్యలు రాకూడదంటే?

ప్రస్తుతం చాలా మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నివారణకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలను మానసిక వైద్యుడు శ్రీకాంత్ పంచుకున్నారు. ‘ఆనందమైన బాల్యం, పేదరికం లేకపోవడం (ధనికులుగా ఉండటం కాదు), దీర్ఘకాలిక స్నేహం, వ్యాయామం, పెళ్లి, భక్తి/ దేవుని పట్ల నమ్మకం, సామాజిక సేవ, సైన్యం లేదా NCC వంటి వాటిలో చేరటం. సమతుల్య ఆహారం, పచ్చదనం, అభిరుచులు (హాబీస్)’ వంటివి ఉండాలని సూచించారు.
News September 15, 2025
అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.