News September 13, 2025
ఒత్తయిన కనుబొమ్మలకి ఈ చిట్కాలు

అందమైన, ఒత్తయిన కనుబొమ్మల కోసం అమ్మాయిలు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వారంలో రెండుసార్లు పెట్రోలియం జెల్లీని ఐబ్రోస్‌కి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి. మెంతిపిండిలో కొబ్బరినూనె కలిపి కనుబొమ్మలకు రాత్రి అప్లై చేసి, ఉదయం శుభ్రం చేసుకోవాలి. మెంతిలో ఉండే నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి.
Similar News
News March 14, 2026
NHPCలో 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు

NHPC లిమిటెడ్ 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో BE/BTech/BSE పూర్తి చేసి 60% మార్కులున్న వారు, MAR 16-APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. GATE 2024/GATE 2025 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూతో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీతం నెలకు రూ.50k- రూ.1.60 లక్షల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు www.nhpcindia.com చూడండి.
News March 14, 2026
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి?

సూర్యుడిని దర్శించుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత ఎడమ నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇవి పూర్తయ్యాక తిరిగి కుడివైపు నుంచి ఎడమవైపునకు రాహువు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. చివరగా ఒక్కొక్క గ్రహం పేరు తలుచుకుంటూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఇలా శాస్త్రోక్తంగా నియమాలను పాటిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
News March 14, 2026
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.


