News September 13, 2025
HYD: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.
Similar News
News March 27, 2026
ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.
News March 27, 2026
కడప: ఆశ వర్కర్ల నియామకంలో గోల్మాల్?

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఆశా వర్కర్ల నియామకంలో పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మహిళలకు కాకుండా అనర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని మాత్రమే నియమించారని ఆరోపణలు ఉన్నాయి.
News March 27, 2026
కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.


