News September 13, 2025

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ

image

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో పాడేరులో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ధీరజ్ రానున్నారు. విద్యాసాగర్ నాయుడిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ అనేక సంచలనాత్మక హత్య కేసులతో పాటు దోపిడీ కేసులను ఛేదించి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు.

Similar News

News March 16, 2026

ఖమ్మం: KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‌లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.

News March 16, 2026

ఈనెల 25తో ముగియనున్న రైతన్న మీ కోసం: JC

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె కర పత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 25తో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా సంపద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ ఉన్నారు.

News March 16, 2026

ప్రజా పాలన లక్ష్యాలను చేరుకోవాలి: సిరిసిల్ల కలెక్టర్

image

జిల్లాలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు.