News September 13, 2025

GWL: నడిగడ్డ మావోయిస్ట్ పోతుల సుజాత లొంగుబాటు

image

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన <>మోస్ట్ వాంటెడ్<<>> మావోయిస్ట్ పోతుల కల్పన @ సుజాత హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ సౌత్ జోన్ బ్యూరో ఇన్‌ఛార్జ్ ఆమె కొనసాగారు. 104 కేసుల్లో నిందితురాలుగా ఉన్న సుజాతపై రూ.1 కోటి రివార్డు ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రభుత్వం తరఫున ఆమెకు రూ. 25 లక్షలు అందజేశారు. ఈ విషయం నడిగడ్డలో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News March 27, 2026

కాసేపట్లో మోదీ మీటింగ్.. ఏం జరగనుంది?

image

PM మోదీ సా.6.30 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై చూపుతున్న ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లై సన్నద్ధతపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవే కాకుండా మోదీ వేరే అంశాలపై ఏమైనా కీలక ఆదేశాలు/ప్రకటన ఇస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దేశంలో <<19488586>>లాక్‌డౌన్<<>> ప్రచారాన్ని కేంద్రం ఇప్పటికే ఖండించింది.

News March 27, 2026

GK: చంద్రయాన్-3 విశేషాలు

image

⋆ ప్రయోగం తేదీ: జులై 14, 2023
⋆ చంద్రుడిపై ల్యాండింగ్: AUG 23, 2023
⋆ రాకెట్ పేరు: LVM3-M4, ల్యాండర్: విక్రమ్, రోవర్: ప్రజ్ఞాన్
⋆ చంద్రయాన్-3 ల్యాండయిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
⋆ ల్యాండింగ్ తేదీని కేంద్రం నేషనల్ స్పేస్ డేగా ప్రకటించింది
⋆ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్
⋆ US, రష్యా, చైనా తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ చేసిన 4th దేశంగా భారత్

News March 27, 2026

రామప్పలో అద్భుతం.. శివలింగాన్ని తాకిన భానుడి కిరణాలు

image

చారిత్రక రామప్ప దేవాలయంలో శుక్రవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని తాకాయి. దీంతో గర్భాలయం కాంతులీనుతూ బంగారు వర్ణంలో మెరిసిపోయింది. కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ఈ అద్భుతం నిదర్శనమని భక్తులు కొనియాడారు. ఏటా ఒక మాసంలో రెండు, మూడు రోజుల పాటు ఈ దృశ్యం కనిపిస్తుందని అర్చకులు హరీష్ శర్మ తెలిపారు.