News September 13, 2025
బాపట్ల జిల్లా SP తుషార్ డూడీ బదిలీ..!

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర్‌ను నియమించారు.
Similar News
News September 13, 2025
హనుమకొండ: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి

రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని రాంనగర్ నివాసంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News September 13, 2025
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
News September 13, 2025
గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.