News September 13, 2025

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు

image

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందారు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు పల్నాడు ఎస్పీగా పనిచేసిన కంచి శ్రీనివాసరావుకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

Similar News

News March 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం విడుదల
➤ సోంపేట: తగ్గిన టమాట ధర..లబోదిబోమంటున్న రైతులు
➤మెళియాపుట్టి: రోడ్డు వేయించండి ఎమ్మెల్యే సార్
➤లావేరు: అడుగుకో గుంత.. వెళ్లేదెలా ?
➤బూర్జ: వర్షాలకు నేల రాలిన మామిడి
➤పలాస: భవనం పైనుంచి జారిపడి కార్మికుడు మృతి
➤శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు
➤పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News March 21, 2026

IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

image

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.

News March 21, 2026

అనంతపురంలో బీజేపీ ‘SIR’ జిల్లా సన్నాహక సమావేశం

image

అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్ కురుబ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్రతినిధి మధుసూదన్, కార్యదర్శి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి హజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.