News September 13, 2025

HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

image

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.

Similar News

News March 23, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

RITES లిమిటెడ్‌ 5 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్, CA/ICWA/CFA/MBA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News March 23, 2026

షాపింగ్‌లో మోసపోయారా?

image

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొన్న వస్తువులు పాడైపోయినా, రిటర్న్ తీసుకోవడంలో లేదా వారంటీ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? వినియోగదారుల ఫోరమ్ ద్వారా మీరు న్యాయం పొందవచ్చు. క‌న్జూమ‌ర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అలాగే ‘8800001915’ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపి కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. <>వెబ్‌సైట్‌లోనూ<<>> మీ సమస్యను తెలియజేస్తే వేగంగా పరిష్కారం లభిస్తుంది.

News March 23, 2026

వ్యాసుడు చెప్పిన కొన్ని పవిత్ర ధర్మాలు

image

☛ మూగ జీవులను హింసించకూడదు.
☛ అబద్ధాలు చెప్పకూడదు.
☛ దొంగతనం చేయకూడదు.
☛ ఇతరుల ఆహారం అపహరిస్తే నరకానికి వెళ్తారు.
☛ తెలిసి పాపాలు చేసిన వారు పూజలు చేయకూడదు.
☛ రహస్యాలను రహస్యంగానే ఉంచాలి.
☛ వేదాలను, గురువులను, నిందించరాదు.
☛ కపటం గలవారితో కలిసి పుణ్య కార్యాలు చేయకూడదు.
☛ పర స్త్రీని తల్లిలా భావించి, గౌరవించాలి.