News April 4, 2024

ఎల్లుండి ఛలో తుక్కుగూడ: సీఎం రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 6న తుక్కుగూడలో ‘తెలంగాణ జన జాతర’ పేరుతో సభ నిర్వహించనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘తెలంగాణ గడ్డపై ప్రకటించే మేనిఫెస్టో.. భారతావని దశ-దిశ మార్చుతుందని చాటే సభ ఇది. ఛలో తుక్కుగూడ’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు: CM

image

AP: క్వాంటం కంప్యూటింగ్, AIలకు ప్రపంచ కేంద్రంగా ఎదగాలనేదే ఏపీ లక్ష్యమని CM చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్, AI కోసం $15Bn ఇన్వెస్ట్ చేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన అంశంపై ఆయన మాట్లాడారు. ‘అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు వస్తాయి. భవిష్యత్తులో ప్రజలు క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు’ అని పేర్కొన్నారు.

News March 7, 2026

భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువ: శాంట్నర్

image

T20 WC ఫైనల్‌కి ముందు కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత ఫ్యాన్స్ ముందు ఆడుతున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసి, స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చి కప్ గెలవడమే తమ లక్ష్యమన్నారు. టీమ్‌ఇండియా బ్యాటర్లను కట్టడి చేయాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడం కీలకమని, బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఛాలెంజ్ అని విశ్లేషించారు.

News March 7, 2026

భవిష్యత్‌లో అనేక దేశాలకు భారత్ విద్యుత్: సీఎం

image

AP: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని CM CBN తెలిపారు. డిప్లమసీ, ఫ్లెక్సిబిలిటీలో మనవాళ్లకు మంచి పేరుందన్నారు. ITలో ఇండియన్స్ పరిజ్ఞానం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ దూసుకెళ్తోంది. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ అందిస్తుంది’ అని జోస్యం చెప్పారు.