News September 13, 2025
అశ్వారావుపేట: వాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల వాగులో ఈరోజు కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. పత్తి చేనులో పనికి వెళ్లిన చెన్నమ్మ(50), వరలక్ష్మి (55) వాగు దాటే క్రమంలో గల్లంతయ్యారు.వారు ఏపీకి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గల్లంతయ్యారని తెలిపారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిలో నలుగురు ఒడ్డుకు చేరుకోగా ఇద్దరు గల్లంతయ్యారు.
Similar News
News March 23, 2026
దొమ్మేటి వెంకటరెడ్డి స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం: కలెక్టర్

సామాజిక న్యాయం, విద్యా ప్రబోధం, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి భావితరాలకు ఆదర్శనీయమని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆయన 174వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఆయన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
News March 23, 2026
ఒకే రోజు రూ.10,320 తగ్గిన 10గ్రాముల బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ <<19453496>>మరోసారి<<>> భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.10,320 తగ్గి రూ.1,35,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.9,450 పతనమై రూ.1,24,350 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,30,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 23, 2026
WNP: గ్యాస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్!

వనపర్తి పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని గ్యాస్ నిల్వలు, డెలివరీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ బుకింగ్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా గ్యాస్ సరఫరా చేయాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.


