News September 13, 2025

అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజమండ్రి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కొయ్యలగూడెం వైపు వస్తున్న శ్రీరామ్ బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజమండ్రి వైపు వెళ్లే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీరామ్, అతని తల్లికి తీవ్రగాయాలు కాగా కొయ్యలగూడెం PHC నుంచి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించినట్లు EMT బద్రి తెలిపారు.

Similar News

News September 13, 2025

‘మిరాయ్’ ఐడియా అప్పుడే పుట్టింది: దర్శకుడు కార్తీక్

image

‘మిరాయ్’ మూవీ ఐడియా 2015-16లో పుట్టిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. చనిపోయిన తన ఫ్రెండ్ అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో కథకు బీజం పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్ అని తెలిపారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు.

News September 13, 2025

ఏలూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్ యాజమాన్యాల అండర్-14,17 వయసున్న బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ శనివారం తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల ఎంపిక ఈనెల 16న స్విమ్మింగ్, వెయిట్ లిఫ్ట్ పోటీలు ASR స్టేడియంలో, 17న కరాటే పోటీలు ఏలూరు రామచంద్రపురం కాస్మో పొలిటిక్స్ క్లబ్‌లో జరుగుతాయి.

News September 13, 2025

ములుగు: అత్యధికంగా వర్షం పడింది ఇక్కడే!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా వెంకటాపురం మండలంలో 106.5 మి.మీ. వర్షం కురిసింది. వాజేడు మండలం ధర్మారంలో 63మి.మీ., వాజేడులో 37మి.మీ., వెంకటాపూర్ లో 28.8మి.మీ., గోవిందరావుపేటలో 23.8మి.మీ., ఏటూరునాగారంలో 22.3మి.మీ. వర్షం పడింది.