News September 13, 2025

NRPT: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి, ఎమ్మెల్యే

image

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచారని శనివారం హైద్రాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులు వేగంగా చేపడుతామని చెప్పారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఉన్నారు.

Similar News

News March 6, 2026

తిరుపతి: ఫలితాలు వచ్చేశాయ్.!

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్, డిసెంబర్ నెలలో డిగ్రీ B.A/ B.Com/ B.Sc/ B.B.A/ B.C.A/ B.Voc మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News March 6, 2026

100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

News March 6, 2026

శుభ సమయం (6-3-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ తదియ సా.5.24 వరకు తదుపరి చవితి ➤ నక్షత్రం: హస్త ఉ.9.18 వరకు, తదుపరి చిత్త ➤ శుభ సమయాలు: ఉ.6.16-8.36, ఉ.10.11-11.10, మ.1.19-సా.4.04, సా.5.02-5.48 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.37-9.24, మ.12.32-1.19 వరకు ➤ వర్జ్యం: సా.5.49-రా.7.32 వరకు ➤ అమృత ఘడియలు: తె.4.03 నుంచి 5.46 వరకు