News September 13, 2025

విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

image

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.

Similar News

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 8, 2026

రేపు సీపీ ఆధ్వర్యంలో ‘PGRS’

image

విశాఖ నగర ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ కమిషనరేట్‌లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

News March 8, 2026

మహిళల భద్రతే మా లక్ష్యం: విశాఖ సీపీ

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్డులో నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన మహిళా పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.