News September 13, 2025

పెద్దపల్లి: ‘చంద్రయ్య మరణం మున్సిపల్ కార్మికులకు తీరని లోటు’

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో శనివారం దివంగత పెద్దపల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ఆరేపల్లి చంద్రయ్య సంతాప సభ నిర్వహించారు. కార్మికులు, యూనియన్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి హాజరయ్యారు. చంద్రయ్య ఆశయ సాధనకు మున్సిపల్ కార్మికులందరూ పట్టుదలతో కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Similar News

News September 14, 2025

సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: HYD మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1984: బాలీవుడ్ హీరో ఆయుష్‌మాన్ ఖురానా జననం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
*హిందీ భాషా దినోత్సవం

News September 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 14, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.35 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.