News September 13, 2025

సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

image

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.

Similar News

News January 25, 2026

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు

image

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) కోల్‌కతాలో 43 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.isical.ac.in

News January 25, 2026

మీ కరెంట్ బిల్లు పంపండి.. WFH ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్

image

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే తమ ఉద్యోగులను ఇంటి కరెంట్ బిల్లు షేర్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ ఇటీవల మెయిల్ పంపింది. కంపెనీ రీస్ట్రక్చరింగ్‌తో దీనికి సంబంధం లేదని.. ఆందోళన చెందొద్దని తెలిపింది. కంపెనీ విద్యుత్తు వినియోగంతో పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ యూసేజ్‌ను తగ్గించాలని పెట్టుకున్న తమ లక్ష్యాన్ని గుర్తుచేసింది.

News January 25, 2026

వెనిజులాపై సైనిక దాడి.. 15నిమిషాలే టైమిచ్చారు: డెన్సీ రోడ్రిగ్జ్

image

వెనిజులాపై అమెరికా సైనిక దాడిలో ఎదురైన సవాళ్ల గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ సంభాషణ వీడియో లీకైంది. తమ డిమాండ్లను అంగీకరిస్తారా? లేక చస్తారా? అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో రికార్డైంది. తనతోపాటు ఇంటర్నల్ మినిస్టర్ డియోస్డాడో కాబెల్లో, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్‌కు 15నిమిషాలు టైమ్ ఇచ్చారన్నారు. మదురో ఆయన భార్యను చంపేసినట్లు యూఎస్ దళాలు ముందుగా తమకు చెప్పాయని తెలిపారు.