News September 14, 2025
KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.
Similar News
News September 14, 2025
కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News September 14, 2025
కరీంనగర్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ మాట్లాడుతూ, ఆధార్ కార్డు మోసాలు, ఏపీకే ఫైల్స్, సిమ్ కార్డుల దుర్వినియోగం, బ్యాంక్ ఖాతా సమాచారం, లింక్స్, పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్ వంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.
News September 13, 2025
KNR: సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వంగ ప్రకాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సొల్లు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంగ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు.