News April 4, 2024

‘బీజేపీలోకి ప్రకాశ్ రాజ్’.. స్పందించిన నటుడు

image

బీజేపీపై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే నటుడు ప్రకాశ్ రాజ్ అదే పార్టీలో చేరనున్నట్లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ‘వాళ్లు బాగా ట్రై చేసినట్టు ఉన్నారు. కానీ సిద్ధాంతాల పరంగా నన్ను కొనగలిగే స్తోమత వారికి లేదని గ్రహించి ఉంటారు. దీని గురించి మీరేమంటారు?’ అని పోస్ట్ చేశారు.

Similar News

News February 1, 2026

జిల్లాకో గర్ల్స్ హాస్టల్: కేంద్రం ప్రకటన

image

సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న మహిళల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటుచేయాలని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. కాలేజీ తరగతులు, ల్యాబుల్లో పరిశోధనలు ఇతర అధ్యయనాలకు ఎక్కువ కాలం వారు వెచ్చించాల్సి వస్తోంది. వారు సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వారికి సదుపాయంగా ఈ హాస్టళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి వివరించారు.

News February 1, 2026

ట్యాక్స్ పేయర్స్‌కు పెద్ద ఉపశమనం

image

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) రివైజ్ చేసుకోవాలనుకునే వారికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంచి వెసులుబాటు కల్పించారు. తక్కువ ఫీజుతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. అయితే, ITR-1, 2 ఫైల్ చేయడానికి మాత్రం యథావిధిగా జులై 31 చివరి తేదీగా ఉంటుంది. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 2%గా నిర్ణయించారు. త్వరలోనే సరళీకరించిన కొత్త టాక్స్ రూల్స్ కూడా రాబోతున్నాయి.

News February 1, 2026

దేశ పురోగతికి ఆరు సూత్రాలు

image

ప్రపంచ పరిణామాలను అందిపుచ్చుకొంటూ దేశం మరింత ముందుకు సాగేలా కేంద్రం బడ్జెట్లో ఆరు సూత్రాలను ప్రకటించింది.
1. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్‌ పెంచడం
2. పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ
3. MSMEలను ఛాంపియన్లుగా మార్చడం
4 మౌలిక సదుపాయాలకు మరింత ప్రోత్సాహం
5 దీర్ఘకాలిక స్థిర భద్రతను కల్పించడం
6 సిటీ ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి.