News April 4, 2024

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్!

image

వాట్సాప్‌లో వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్‌లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో యాప్‌లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్‌కి మారినప్పుడు కూడా ఈ మోడ్‌లో వీడియోలను చూసే వీలుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

Similar News

News December 28, 2025

వెండి కొనుగోలుకు షాపుల నిరాకరణ

image

వెండి ధరలు భారీగా పెరగటంతో బులియన్ మార్కెట్‌లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. KG ధర ₹2.74 లక్షలకు చేరటంతో వెండిని కొనడానికి వ్యాపారులు వెనకాడుతున్నారు. ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల నగదు కొరత, మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతుందనే భయంతో చేతులెత్తేస్తున్నారు. ఒకవేళ కొన్నా తక్కువ ధర ఆఫర్ చేస్తున్నారు. దీంతో అత్యవసరంగా డబ్బు కావాల్సిన వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

News December 28, 2025

దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!

image

బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు NDTVతో చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు. అసలు దీపూ ఏ మతాన్నీ విమర్శించలేదని అధికారులు తేల్చినట్లు చెప్పారు. హిందువు అనే కారణంతో, ఎదుగుతున్నాడనే అసూయతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు.

News December 28, 2025

చలి మంట.. పసిపిల్లలు మృతి

image

చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.