News September 14, 2025

సెప్టెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1923: ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ జననం
1958: అవధాని గరికపాటి నరసింహారావు జననం
1962: సినీ నటి మాధవి జననం
1967: HYD మాజీ సీఎం బూర్గుల రామకృష్ణారావు మరణం
1984: బాలీవుడ్ హీరో ఆయుష్‌మాన్ ఖురానా జననం
1990: టీమ్ ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ జననం
*హిందీ భాషా దినోత్సవం

Similar News

News January 22, 2026

గ్రీన్‌లాండ్‌ స్ట్రాటజిక్ లొకేషన్.. ట్రంప్ ప్రేమకు కారణమిదే!

image

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడానికి ప్రధాన కారణం దాని స్ట్రాటజిక్ లొకేషన్. ఆర్కిటిక్ రీజియన్‌లో అది ఒక గేట్ వే లాంటిది. అక్కడ USకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ ఉంది. ఇది రష్యా కదలికలను గమనించడానికి చాలా కీలకం. అలాగే మంచు కరుగుతుండటంతో కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇవి బిజినెస్‌కి ప్లస్ పాయింట్. అక్కడ భారీగా అరుదైన భూ మూలకాలు, బంగారం, ఆయిల్ నిక్షేపాలూ ఉన్నాయి.

News January 22, 2026

‘భగవంత్ కేసరి’ బిగ్ హిట్ కావాల్సింది: అనిల్

image

తన కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ‘ఈ మూవీ భారీ విజయం సాధించాల్సింది. విడుదలైన సమయంలో చంద్రబాబు జైలులో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు మూవీని హిట్ చేశారు. పరిస్థితులు బాగుంటే మరింతగా హిట్ అయ్యేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది.

News January 22, 2026

సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు.