News September 14, 2025

అన్నమయ్య: ఇవాళ్టి బొప్పాయి ఎగుమతి ధరల నిర్ణయం

image

ఇవాళ టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ ధరకు అమ్మే వ్యాపారులపై రైతులు ఫిర్యాదు చేయాలని, ఇందుకు కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951 లను సంప్రదించాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు

News September 14, 2025

ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్‌2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.

News September 14, 2025

HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.