News April 4, 2024
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని వాదించారు. లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని, అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, ఫోన్లలో డేటా డిలీట్ చేసి ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, మహిళగా, చట్టసభ సభ్యురాలిగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె న్యాయవాది వాదించారు.
Similar News
News December 29, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* గారెలు మంచి రంగులో రావాలంటే వేయించే నూనెలో కొద్దిగా చింతపండు వేస్తే సరిపోతుంది.
* క్యాలీఫ్లవర్ ఉడికించేప్పుడు పాలు పోస్తే కూర రంగుమారదు.
* ఉల్లిపాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా వెనిగర్ రుద్దుకుంటే చేతులకు వాసన అంటకుండా ఉంటుంది.
* కొబ్బరి పాలు తీస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు వాడితే పాలు సులువుగా, ఎక్కువగా వస్తాయి.
* చపాతీ పిండిపై తడిబట్టను కప్పితే అది ఎండిపోకుండా ఉంటుంది.
News December 29, 2025
భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులివే..

ఏడో నెల నుంచి భర్త క్షవరం చేయించుకోకూడదు. సముద్ర స్నానం, పడవ ప్రయాణం, పర్వతారోహణ వంటి సాహసాలు చేయకూడదు. శవయాత్రల్లో పాల్గొనడం, పిండదానాలు చేయడం వంటి అశుభ కార్యాలకు వెళ్లరాదు. గృహ నిర్మాణం, విదేశీ ప్రయాణాలు మానాలి. ఈ నియమాల ముఖ్య ఉద్దేశం భార్యకు మానసిక ప్రశాంతతనివ్వడం, పుట్టబోయే బిడ్డకు ఎటువంటి అరిష్టం కలగకుండా చూడటం. భార్య కోరికలు తీరుస్తూ ఆమెను సంతోషంగా ఉంచడమే భర్త ప్రధాన కర్తవ్యం.
News December 29, 2025
31న సమ్మె.. టైమ్ చూసి దెబ్బ!

ఏడాది ముగింపు వేళ మరోసారి డెలివరీ వర్కర్లు(గిగ్) <<18690914>>సమ్మెకు<<>> సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో పార్టీ మూడ్‌లో ఉండే ప్రజలకు ఫుడ్, గిఫ్ట్‌లు ఇతర ఆర్డర్లు అందిస్తూ ఈ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో 31న సమ్మె చేస్తే తమ డిమాండ్లు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజున వీరికి డిమాండ్ ఎక్కువే. మెట్రో, టైర్-2 సిటీల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించనుంది.


