News September 14, 2025

NTR: విషజ్వరాలు.. ప్రజల్లో ఆందోళన.!

image

NTR జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది విజయవాడలో ఆసుపత్రిలో చేరగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వారిని పరామర్శించారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News September 14, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్‌లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 14, 2025

ముప్పైల్లోనే ముడతలా..?

image

ప్రస్తుతం చాలామందిలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కన్పిస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితం కావడం వల్ల చర్మం సాగే గుణం కోల్పోతుంది. దీంతో ముడతలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్లను తక్కువగా వాడటంతోపాటు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించే హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడాలి.

News September 14, 2025

లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

image

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.