News September 14, 2025
అనకాపల్లి: ఢిల్లీ సదస్సుకు కొత్తూరు సర్పంచ్

నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈనెల 15 న జరిగే సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మీప్రసన్నకు ఆహ్వానం అందింది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 75 మంది సర్పంచులను సదస్సులకు ఆహ్వానించగా ఏపీ నుంచి ఆరుగురు ఉన్నారు. వారిలో కొత్తూరు సర్పంచ్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఆమె ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
Similar News
News September 14, 2025
BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.
News September 14, 2025
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SP

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ వారంలో మొత్తం 20 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.
News September 14, 2025
రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.