News April 4, 2024

MBNR: ఎండలు ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఈ క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత ధరూర్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 43.3, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.1, మహబూబ్నగర్ జిల్లా సల్కార్ పేటలో 41.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 41.4 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News March 14, 2026

సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

News March 14, 2026

MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.

News March 14, 2026

నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.