News September 14, 2025
HYDలో రేషన్‌కార్డులు కట్.. దేనికో తెలియక షాక్

HYDలో చాలా చోట్ల లబ్ధిదారులకు రేషన్‌కార్డు రద్దయ్యాయని లబోదిబోమంటున్నారు. రేషన్‌షాపుల దగ్గర కార్డ్ నం. ఎంటర్ చేసేవరకు తెలియడం లేదని, దీనిపై ఎలాంటి సమాచారం లేదని మండిపడుతున్నారు. IT చెల్లించకున్నా తమ తెల్లరేషన్‌కార్డు రద్దవ్వడంపై గందరగోళానికి గురవుతున్నారు. కాగా, ఆధార్, పాన్ ద్వారా ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్నుశాఖ పరిశీలించి అనర్హుల కార్డు ర్దదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News September 14, 2025
రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.
News September 14, 2025
HYD: ‘BRS విష ప్రచారాలను తిప్పి కొట్టాలి’

గ్రూప్-1 పరీక్షపై BRS చేస్తున్న విష ప్రచారాలను ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తల తిప్పికొట్టాలని రాష్ట గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. హైకోర్ట్ తీర్పును తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టంచేశారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నారని మాట్లాడిన KTRపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని BRS నాయకులకు హితవు పలికారు.
News September 14, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.