News April 4, 2024

భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు నిలిపివేత

image

భద్రాచలం రామాలయంలో ఈనెల 9నుంచి 23వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 24నుంచి తిరిగి నిత్య కళ్యాణాలు ఉంటాయన్నారు. 9న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

Similar News

News March 20, 2026

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News March 20, 2026

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ డిజైన్లపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో 9 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. నాబార్డ్ నిధులతో జీ+1 పద్ధతిలో తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మెటీరియల్‌తో అత్యుత్తమ డిజైన్లు రూపొందించాలని, ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

News March 20, 2026

రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

image

ఖమ్మం: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.