News September 14, 2025

జన్నారం: భూమి కోసమే ఉద్యమం!

image

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని జన్నారం, దండేపల్లి మండలాల్లో పోడు భూముల సమస్య జటిలమవుతోంది. జన్నారం మండలం పాలగోరిలో తమ పూర్వీకుల భూములను అప్పగించాలని ఆదివాసులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో దండేపల్లి మండలం లింగాపూర్, దమ్మన్నపేటలో కూడా ఆదివాసులు అటవీ భూములు ఇవ్వాలని పోరు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందికి, ఆదివాసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో రెండు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Similar News

News September 14, 2025

HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

MBNR:GOOD NEWS.. ITIలలో నేరుగా ప్రవేశాలు

image

MBNRలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్లకు వాక్ ఇన్ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ బి.శాంతయ్య Way2Newsతో తెలిపారు. ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ కాలేజీలలో ఈ నెల 30 వరకు 4వ విడత స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని, 1,2,3 విడుదలలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హత గల ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 14, 2025

HYD: భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు