News September 14, 2025
నెల్లూరు: కూలితే.. తల బద్దలే..!

నెల్లూరు ప్రసూతీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సోలార్ లైటింగ్ పోల్ పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వండలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రి ఆవరణలో ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆసుపత్రి సిబ్బంది, అధికారులకు ఈ దృశ్యం కనిపించడం లేదా అన్నది ప్రశ్నగా ఉంది. ఇకనైనా స్పందించకపోతే ఎవరిపైనా అయినా పడిపోయే అవకాశం ఉంది. పెనుప్రమాదం జరగక ముందే దాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 6, 2025
నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్‌లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.
News November 5, 2025
నెల్లూరు: రేపే నారా లోకేశ్ రాక

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన ఖారారైంది. ఆయన గురువారం దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు.


