News September 14, 2025

యాదాద్రి భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు కియోస్క్ యంత్రాలను ఈవో వెంకట్రావు ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Similar News

News September 14, 2025

కామారెడ్డి: రేపు విద్యుత్ ప్రజావాణి

image

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్‌డివిజన్, సెక్షన్, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 14, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి కార్యక్రమం

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

News September 14, 2025

దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు: లోకేశ్

image

AP: తన కుమారుడు దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాన్ష్ ముందు చూపు, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ వివరించారు.