News September 14, 2025
HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.
Similar News
News September 14, 2025
గూగుల్ తల్లే.. ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే’కు ఆధారం

గూగుల్ మ్యాప్.. మనం ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లడానికి దీనిపైనే ఆధారపడతాం. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ తల్లినే నమ్ముకున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందనే విషయంపై గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ రోడ్డు దాదాపు 210 నుంచి 230 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
News September 14, 2025
HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

నాగోల్‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2025
HYD: విద్యార్థినుల ఫోన్ నంబర్లు వారికెలా వచ్చాయి?

మహిళా వర్సిటీ విద్యార్థినులను వేధిస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురికీ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఎలా వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిందితుల్లో ఒకరు కార్ డ్రైవర్, మరొకరు హౌస్ కీపింగ్ బాయ్, మరొకరు డెలివరీ బాయ్. అంతమంది నంబర్లను ఎలా సేకరించారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.