News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 4, 2026
ప్రేమ, కరుణకు కేంద్రం ‘అనాహత చక్రం’

ఛాతీ మధ్యలో ఉండే ఈ చక్రం ప్రేమ, కరుణకు కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే అందరిపై నిస్వార్థమైన ప్రేమ, క్షమాగుణం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అస్థిరత ఏర్పడితే ఒంటరితనం, గుండె సంబంధిత ఇబ్బందులు, ఇతరులపై ద్వేషం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘యం’ మంత్రాన్ని జపించాలి. ఆకుపచ్చని ప్రకృతిలో సమయం గడపడం, ప్రాణాయామం చేయడం, సాటి జీవుల పట్ల దయతో మెలగడం వల్ల ఈ చక్రం అద్భుతంగా పని చేస్తుంది.
News February 4, 2026
ఏడేళ్లలో 7,400 మంది నక్సలైట్ల అరెస్ట్: కేంద్రం

గడచిన దశాబ్దన్నర కాలం నుంచి దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రేరేపిత హింసాత్మక ఘటనలు 88 శాతం మేర తగ్గాయని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది లొంగిపోయారని తెలిపింది. 2025లో 364 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, 1,022 మందిని అరెస్టు చేశాయని, 2,337 మంది లొంగిపోయారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు తెలిపారు.
News February 4, 2026
భావ వ్యక్తీకరణకు మూలం ‘విశుద్ధ చక్రం’

గొంతు భాగంలో ఉండే ఈ చక్రం భావ వ్యక్తీకరణకు మూలం. ఇది సరిగ్గా ఉన్నప్పుడు మాటలో స్పష్టత, సత్యాన్ని పలికే ధైర్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లభిస్తాయి. అస్థిరంగా ఉంటే గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, ఇతరులతో మాట్లాడటానికి భయం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘హం’ మంత్రాన్ని పఠించాలి. ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం ద్వారా ఈ చక్రంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు.


