News September 14, 2025
జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.
Similar News
News September 14, 2025
ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.
News September 14, 2025
సెప్టెంబరు 17 నుంచి ‘స్వస్థ నారి’ కార్యక్రమం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి ‘స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం. దుర్గారావు దొర తెలిపారు. అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
News September 14, 2025
పాలమూరు: తల్లిపై అత్యాచారయత్నం.. కొడుకుని చంపిన తండ్రి

మద్యం మత్తులో కన్నతల్లిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కొడుకుని తండ్రి హతమార్చిన ఘటన ఆదివారం జడ్చర్ల(M)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాచారం సమీపంలో నివాసముండే శ్రీధర్(28) మద్యం మత్తులో ఇంట్లో పడి ఉన్నాడు. అతడిని లేపేందుకు చూసిన తల్లి లక్ష్మిపై దారుణానికి యత్నించడాన్ని చూసిన తండ్రి నాగయ్య ఆగ్రహానికి లోనై కర్రతో దాడి చేశాడు. తీవ్రగాయాలైన శ్రీధర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.