News September 14, 2025
లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.
Similar News
News September 14, 2025
యాదాద్రి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం భువనగిరి, నల్గొండ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు, మూడు గంటల్లో యాదాద్రికి ఆరెంజ్ అలర్ట్, నల్గొండకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 14, 2025
NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.
News September 14, 2025
ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.