News September 14, 2025
ముప్పైల్లోనే ముడతలా..?

ప్రస్తుతం చాలామందిలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కన్పిస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితం కావడం వల్ల చర్మం సాగే గుణం కోల్పోతుంది. దీంతో ముడతలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్లను తక్కువగా వాడటంతోపాటు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించే హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడాలి.
Similar News
News February 18, 2026
నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాక్

T20WC: నమీబియాపై పాకిస్థాన్ 102 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 199/3 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ (58 బంతుల్లో 100)తో రాణించారు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. కాగా సూపర్-8లో పాకిస్థాన్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలతో తలపడనుంది.
News February 18, 2026
‘అమ్మను బాగా చూసుకో’.. సోనూసూద్ ఉదారత!

గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైన తన తల్లి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనే శక్తి లేదని ఓ నెటిజన్ చేసిన విన్నపానికి నటుడు సోనూసూద్ స్పందించారు. ఆక్సిజన్ యంత్రాన్ని నేరుగా వారి ఇంటికే పంపించి తన ఉదారతను చాటుకున్నారు. ‘తల్లిని బాగా చూసుకో’ అని ఆ యువతికి ధైర్యం చెప్పారు. కరోనా కష్టకాలం నుంచి సోనూసూద్ నిరంతరం సామాన్యులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
News February 18, 2026
భారీగా పెరిగిన సిగరెట్ ధరలు

ITC సంస్థ సిగరెట్ ధరలను 19-41% పెంచింది. FEB 1 నుంచి <<18730084>>కొత్త<<>> ఎక్సైజ్ డ్యూటీస్, ట్యాక్స్‌లు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్, క్లాసిక్ వంటి బ్రాండ్ల సిగరెట్ ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్లేక్ 10 సిగరెట్ల ప్యాక్ ధర ₹170 నుంచి ₹240కి చేరింది. 20 పీస్ క్లాసిక్ వేరియంట్ ప్యాక్ ₹340 నుంచి ₹480కి పెరిగింది. అలాగే సూపర్‌స్టార్ వాల్యూ ₹70 (10Pc)కి పెరిగింది.


