News April 4, 2024
వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News July 5, 2025
వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 4, 2025
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
News May 7, 2025
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పరీక్ష ఫీజులు చెల్లించని కారణంగా డిగ్రీ(రెగ్యులర్) 2వ, 4వ, 6వ, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మరోసారి ప్రకటిస్తామని పేర్కొన్నారు.