News April 4, 2024

‘గాలి’ మళ్లీ బీజేపీవైపు వీచింది!

image

ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీ క్యాంప్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల తిరిగి బీజేపీలో చేరి.. తాను స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని విలీనం చేశారు. బళ్లారిలో BJP బలపడటంలో ‘గాలి’ది కీలక పాత్ర. 2022లో BJP నుంచి వైదొలగి KRPP స్థాపించి MLAగా గెలిచారు. గాలి ఎఫెక్ట్ 2023 ఎన్నికల్లో కనిపించడంతో ఈ రీఎంట్రీతో BJPకి బలం చేకూరనుందని టాక్.
<<-se>>#Elections2024<<>>

Similar News

News March 16, 2026

పశ్చాత్తాపం అంటే ఇదేనేమో.. దొంగిలించిన నగలను తిరిగిచ్చాడు!

image

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ వింత ఘటన జరిగింది. ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దంపతుల బంగారు నగలను కాజేశాడో దొంగ. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అనుకున్నాడో ఏమో.. 20 రోజుల తర్వాత ఆ నగలను బాధితుల ఇంటికే కొరియర్‌లో పంపించాడు. ఇంటి ముందున్న పార్సిల్ చూసి షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వేలిముద్రల ఆధారంగా దొంగ ఎవరో తేల్చేపనిలో పోలీసులున్నారు.

News March 16, 2026

ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు: రాజాసింగ్

image

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను BJLP ఛాంబర్‌కి వెళ్లడంపై MLA రాజాసింగ్ స్పందించారు. ‘పాత ఇల్లు, పాత ఫ్రెండ్స్ కాబట్టి వెళ్లా. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎవరిని ఎవరు బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా BJLP ఛాంబర్ నుంచి వస్తున్న రాజాసింగ్‌ను చూసిన KTR ‘BJP నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లారు?’ అని సరదాగా ఆటపట్టించారు.

News March 16, 2026

నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

image

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.