News September 14, 2025

నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా: మోదీ

image

తనపై వచ్చే విమర్శలపై ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా. అస్సాం పుత్రుడు, భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. వాటిని అస్సాం ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News September 14, 2025

ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.

News September 14, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News September 14, 2025

BREAKING: అస్సాంలో భారీ భూకంపం

image

అస్సాంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సోనిత్‌పూర్ జిల్లాలో రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొరుగు దేశాలు చైనా, భూటాన్, మయన్మార్‌లోనూ భూమి కంపించింది. కాగా ఇవాళ ప్రధాని మోదీ అస్సాంలో పర్యటించిన సంగతి తెలిసిందే.