News September 14, 2025
YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా

AP: వైసీపీ హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని BJP జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. YCP అవినీతిపాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారన్నారు. విశాఖలో ‘సారథ్యం’ సభలో ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు దేశంలో ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోలు తీసుకువచ్చి అధికారంలోకి వచ్చేవారు. దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు ఉండేవి. 2014 తర్వాతే దేశంలో మార్పులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News September 14, 2025
ప్రైవేట్ కాలేజీల బంద్.. కాసేపట్లో కీలక చర్చ

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీలు సోమవారం నుంచి <<17692548>>బంద్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు కాలేజీల బంద్‌కు AISF మద్దతు ప్రకటించింది.
News September 14, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
News September 14, 2025
BREAKING: అస్సాంలో భారీ భూకంపం

అస్సాంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సోనిత్‌పూర్ జిల్లాలో రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొరుగు దేశాలు చైనా, భూటాన్, మయన్మార్‌లోనూ భూమి కంపించింది. కాగా ఇవాళ ప్రధాని మోదీ అస్సాంలో పర్యటించిన సంగతి తెలిసిందే.