News September 14, 2025
రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.
Similar News
News September 14, 2025
అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పురోగతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
News September 14, 2025
బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ఏలూరు: DSPల పనితీరుపై IG సమీక్ష

ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రొబేషనరీ DSPల పనితీరుపై సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. లాండ్ ఆర్డర్ విభాగంలో నిర్వర్తించిన విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలను ఆలకించి తగిన సూచనలు సలహాలు తెలియచేశారు. సమర్థవంతమైన అధికారులుగా ఎదిగి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని IG ఆకాంక్షించారు. ఏలూరు SP, కోనసీమ SP, తదితరులు పాల్గొన్నారు.