News September 14, 2025

నరసరావుపేట: ‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 15న కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.

News September 14, 2025

ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఖమ్మం జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం ఖమ్మం SR&BGNR కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఉదయం సెషన్‌లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.

News September 14, 2025

రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.