News September 14, 2025
మొక్కలు నాటడంలో సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్ సృష్టించారు. భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక ఉన్న మైదానంలో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి బలరాం పాల్గొని 370 మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు.
Similar News
News September 14, 2025
ఖమ్మం: వ్యభిచార గృహంపై దాడి.. కేసు నమోదు

బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్‌ఐ పొదిలి వెంకన్న ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ విటుడు, ఓ మహిళ, నిర్వాహకురాలు మంగమ్మను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News September 14, 2025
కృష్ణా: జిల్లాల మార్పులపై ఉత్కంఠ

జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గం ఉప సంఘం నివేదిక రెడీ అవుతోంది. ఇప్పటికే జిల్లాలలో అర్జీలు స్వీకరించగా.. ప్రజలు అభిప్రాయాలు తెలిపారు. ఇందులో భాగంగా NTR జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు NTR పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను NTR జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.
News September 14, 2025
రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.