News April 4, 2024
HYDలో నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు

GHMC పరిధి యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్, మల్కాజిగిరి, అంబర్‌పేట, రాంనగర్, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఉప్పల్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా లో ప్రెషర్ సమస్యలు ఏర్పడుతున్నాయని వాటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News July 5, 2025
HYDలో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.
News July 5, 2025
HYD: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.
News July 5, 2025
HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.