News September 14, 2025

భ‌ద్ర‌త‌, ప‌రిశుభ్ర‌త‌లో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు: కలెక్టర్

image

ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌, బ‌స్టాండ్ ప‌రిశుభ్ర‌త‌లో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. విజ‌య‌వాడ పండిట్ నెహ్రూ బ‌స్టాండ్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్లాట్‌ఫామ్‌ల‌తో పాటు తాగునీటి పాయింట్లు, మ‌రుగుదొడ్ల ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. ఏ స‌మ‌యంలోనైనా అప‌రిశుభ్ర‌త అనే మాట వినిపించ‌కూడ‌ద‌న్నారు. ప్ర‌యాణికుల ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించేలా ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Similar News

News September 14, 2025

రూ.153 కోట్లతో USలో ఇల్లు కొన్న అంబానీ

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అమెరికాలో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది. న్యూయార్క్‌లోని ఈ ఇంటి విలువ $17.4 మిలియన్లు (రూ.153 కోట్లు) అని పేర్కొంది. గత పదేళ్లుగా అది ఖాళీగా ఉందని తెలిపింది. 2018లో రాబర్ట్ పేరా $20 మిలియన్లకు దీన్ని కొనుగోలు చేశారు. 20వేల స్క్వేర్ ఫీట్ల ఈ భారీ భవంతిలో 7 బెడ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, 5వేల స్క్వేర్ ఫీట్ల ఔట్ డోర్ స్పేస్ ఉన్నాయి.

News September 14, 2025

జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న అరకు ఎంపీ

image

తిరుపతిలో ఆదివారం జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీ తెలిపారు. చట్ట సభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్ర తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.

News September 14, 2025

పాకిస్థాన్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

ఆసియాకప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: అభిషేక్, గిల్, సూర్య కుమార్(C), తిలక్ వర్మ, శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్, కుల్దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాక్: ఫర్హాన్, అయుబ్, హారిస్, జమాన్, సల్మాన్(C), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, అష్రఫ్, షాహిన్ అఫ్రిదీ, ముఖీం, అహ్మద్

*SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.