News September 14, 2025

KNR: పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని నమ్మకం

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస(పెద్దల అమావాస్య) ఈ రోజు ప్రారంభమైంది. తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే కార్యక్రమం ఇది. ఈ అమావాస్య రోజున పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని ప్రజల నమ్మకం. శ్రాద్ధకర్మ చేయడం ద్వారా వారి తర్వాతి తరం వారికి దీవెనలు అందుతాయని పల్లెల్లో విశ్వసిస్తారు. ఈ అమావాస్య అనంతరం విజయదశమి వేడుకలు ప్రారంభమవుతాయని, పండితులు, శాస్త్రాలు తెలుపుతున్నాయి.

Similar News

News September 14, 2025

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CM

image

AP: తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, ప్రతి బస్సుకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త బస్ స్టేషన్లో 150 బస్సులు ఒకేసారి నిలిపేలా బస్‌బే ఉండాలని, లక్ష మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించాలని సూచించారు.

News September 14, 2025

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌ బాధ్యతలు

image

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పురోగతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

News September 14, 2025

కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

image

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.