News September 14, 2025
దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నూతన ఎస్పీ

ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పుట్టపర్తి నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దుర్గా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పట్టణంలోని చర్చి, మసీదులకు వెళ్లి ఆయా మత సంప్రదాయాలను గౌరవిస్తూ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.
Similar News
News September 14, 2025
అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పురోగతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
News September 14, 2025
కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.
News September 14, 2025
పటాన్‌చెరు: 18న జిల్లా స్థాయి చెస్ ఎంపికలు

పటాన్‌చెరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జిల్లా స్థాయి చెస్ అండర్- 14, 17 ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అండర్- 14కు 1-1-2012, అండర్-17కు 1-1-2009 తర్వాత జన్మించిన వారు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 9849531989, 9505796688 నంబర్లకు సంప్రదించాలని కోరారు.