News September 14, 2025

టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన తిరపతి కొత్త SP

image

తిరుమలలో ఆదివారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును నూతన ఎస్పీ సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని బీఆర్ నాయుడు SP సుబ్బారాయుడుకు సూచించారు. అనంతరం ఆయన్ను అభినందిస్తూ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.

Similar News

News September 14, 2025

రెండో కాన్పు తర్వాత చాలా ఇబ్బంది పడ్డా: ఇలియానా

image

రెండో ప్రసవం తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందులను హీరోయిన్ ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘రెండో బిడ్డ పుట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఆ సమయంలో పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. నేను అది చాలా కష్టంగా ఫీలయ్యాను. మెంటల్ స్పేస్ పూర్తిగా లేకుండా పోయింది. ఆ సమయంలో నేను ముంబైలో లేను. అక్కడే ఉండుంటే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News September 14, 2025

6 పరుగులకే 2 వికెట్లు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. హార్దిక్ పాండ్య తొలి బంతికే వికెట్ తీశారు. ఓపెనర్ అయుబ్(0) ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా ఒడిసి పట్టారు. బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి హారిస్ (3) పాండ్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 6/2.

News September 14, 2025

గుంటూరు: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణరావు

image

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో జరుగుతున్న 18వ ఏపీ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కశాకర్, యుటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయుకులు, తాదితర సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సన్మానం నిర్వహించారు.